సుధీర్ కి విజయ్ ఆంటోనీ కూడా పెద్ద ఫ్యాన్
on Jun 23, 2025
సర్కార్ సీజన్ 5 లేటెస్ట్ ప్రోమో ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంది. ఈ షోకి "మార్గన్"మూవీ టీమ్ వచ్చింది. విజయ్ ఆంటోని, అజయ్ ధిషన్ వచ్చారు. రాగానే "మీకు నేను చాలా పెద్ద ఫ్యాన్..మీరు ఎంచుకుంటే సబ్జెక్ట్స్ చాలా బాగుంటాయి " అంటూ సుధీర్ చెప్పాడు. దాంతో విజయ్ ఆంటోని వెంటనే "నేను కూడా నీకు చాలా పెద్ద ఫ్యాన్ ని.. నీ షోస్ అన్ని నేను చూసాను. రష్మీతో నీ కెమిస్ట్రీ చాలా ఆసంగా ఉంటుంది" అనేసరికి సుధీర్ సిగ్గుపడిపోయాడు. "సర్ అసలు నేను ఇన్ని షోస్, సినిమాలు ఎందుకు చేస్తున్నానో మీకు తెలుసా సర్" అనగానే బిచ్చగాడు మూవీలోంచి "ఒక్క పూట అన్నం కోసం" అంటూ సాంగ్ పడేసారు విజయ్. ఇక మూవీలో లేడీ క్యారెక్టర్స్ ఐన బ్రిగిడ సాగ, దీప్ షికా వచ్చారు. సుధీర్ ఐతే "మీరు సర్కార్ గురించి టెన్షన్ పడక్కర్లేదు..బ్రెయిన్ ఉన్నోళ్లు విన్ అవుతారు అసలు బ్రెయిన్ లేనోళ్ళు ఉన్నారనుకోండి" అనేసరికి "యాంకర్ అవుతారు" అంటూ కౌంటర్ వేసింది.
"నువ్వేం ప్రేమ కోసం వెతకక్కర్లేదు.." అంటూ దీప్ షికా సుధీర్ ని చూసి కన్ను కొట్టింది. దాంతో సుధీర్ ఎం చేశారు మేడం మీరిప్పుడు అన్నాడు వెంటనే అజయ్ ఎంట్రీ ఇచ్చి " రష్మీ మేడంకి ఈ విషయం తెలుసా" అని అడిగాడు. ఇక ఈ షోలో "గీతాంజలి" మూవీలోని ఒక సీన్ ని స్పూఫ్ గా చేశారు సుధీర్, దీప్ షికా. విజయ్ ఆంటోనీ వాళ్ళను డైరెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇలా ఈ టీమ్ మొత్తం సర్కార్ నెక్స్ట్ ఎపిసోడ్ లో నవ్వించబోతున్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
